ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉండే బస్తీలలో ఆర్.యస్.యస్ ఐటి మిలన్స్ ఆరోగ్య శిబిరం నిర్వహణ.

WP_20160515_20_00_47_Pro

WP_20160515_20_00_47_Proఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉండే బస్తీలలో  ఆర్.యస్.యస్ ఐటి మిలన్స్ ఆరోగ్య శిబిరంనిర్వహణ.  ఆర్.యస్.యస్ ఐటి మిలన్స్ ,
సేవా భారతి సహకారంతో ఉచిత వైద్య శిబిరం మే 15 న సిద్ధిక్ నగర్, గచ్చి బౌలిసమీపంలో అట్టడుగు వర్గాల కోసం నిర్వహించారు .

ఈ ప్రాంతంలో ప్రధానంగా భద్రతా సిబంది, పని వారు , వంటమనుషులు , మరియుడ్రైవర్లు నివసిస్తున్నారు  . జనాభా చాలావరకు , అస్సాం , బెంగాల్, ఒరిస్సా వంటి తూర్పు మరియు ఈశాన్య భాగం నుండి వచ్చారు.

WP_20160515_20_02_56_Pro2012 లో అస్సాంలో బోడో లు మరియు ముస్లిముల మధ్య హింసాత్మక సంఘటనలుజరగడం మూలాన అస్సామీ వాసులు అతి పెద్ద సంఖ్యలో వలస వచ్చారు. వలసకార్మికుల, స్థానికుల మద్య భద్రతా మరియు సోదర స్ఫూర్తిని సామరస్యాన్ని తీసుకురావడం కోసం, ఐటి మిలన్  స్వయం సేవకులు .సిద్ధిక్ నగర్లో పనిప్రారంభించారు.

అంతకుముందు ఐటి మిలన్  స్వయం సేవకులు ఈ  ప్రాంతంలో రక్షా బంధన్ మరియుభారతమాత  పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ప్రాథమిక వైద్య పరిశీలనకు సుమారు 125 మంది మించి ఈ శిభిరంలో పాల్గొన్నారు.ఈ శిభిరం సాయంకాలం  5 గం|| కు మొదలుకుని రాత్రి 9 గం|| వరకు జరిగింది.WP_20160515_19_58_33_Pro
రక్షణ సిబంది ఎక్కువ సమయం నిలబడాలి  కావున వారి నిద్ర మరియు ఆహార అలవాట్లఅన్ని వారి పని కారణంగా గందరగోళంలో ఉన్నాయి , మరియు కొంత మంది ప్రజలుపొగాకు మరియు మద్యానికి బానిసలు ఐపోయారు. కాబట్టి, వైద్యులు వారికి వైద్యసంప్రదింపులు మాత్రమే  కాకుండా ఆహారపు అలవాట్లను గురించి వారికి సలహాఇచ్చారు..

డాక్టర్ చంద్ర భూషణ్ గారు, డాక్టర్ అనుపా గారు మరియు డాక్టర్ చక్రపాణి గారు ఈశిబిరానికి వారి సేవలు మరియు నైపుణ్యం అందించారు.

15 కంటే ఎక్కువ ఐటి మిలన్స్ స్వయం  సేవకులు  ఈ శిబిరం లో స్వచ్ఛందంగాసేవలన్దించారు .  ఎలాంటి కర పత్రాలు ఉపయోగించకుండా వ్యక్తిగతంగా ఇంటింటికివెళ్లి పరిచయం చేసుకోవడం ద్వారా 600 పైగా నివాసితులతో సంప్రదింపులు జరిపడంవిశేషం.

Comments are closed.